close

తాజా వార్తలు

Published : 29/04/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రశ్నించారని పోలీసులపైనే దాడి

పుణె: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా కొందరు మాత్రం ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తూ పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులపై దాడికి సైతం పాల్పడుతున్నారు. తాజాగా సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్నారని ప్రశ్నించినందుకు ముగ్గురు వ్యక్తులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.

పుణె శివారులోని పింప్రీ చించ్‌వాడ్‌ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై తిరుగుతూ పోలీసులకు కనిపించారు. ఎందుకు బయటకు వచ్చారని పోలీసులు ప్రశ్నించగా.. సమాధానం ఇవ్వలేదు సరికదా వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. దాడికి పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.