close

తాజా వార్తలు

Published : 28/05/2020 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌.. చైనా.. ‘మధ్య’లో ట్రంప్‌!

మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధమంటూ ట్వీట్‌

వాషింగ్టన్‌: సరిహద్దు విషయంలో భారత్‌- చైనా మధ్య వివాదం రాజుకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అమెరికా మధ్యవర్తిగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే భారత్‌, చైనాలకు తెలియజేశామంటూ బుధవారం ట్వీట్‌ చేశారు.

‘‘సరిహద్దు వివాదం ముదురుతున్న వేళ మధ్యవర్తిగా వ్యవహరించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఈ విషయం భారత్‌, చైనాకు ఇప్పటికే తెలియజేశాం. ధన్యవాదాలు’’ అని ట్రంప్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో కశ్మీర్‌ వ్యవహారంలో సైతం భారత్‌- పాక్‌ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తానంటూ ట్రంప్‌ ముందుకొచ్చారు. దీన్ని భారత్‌ అప్పట్లో వ్యతిరేకించింది. ఇది భారత్‌, పాక్‌ల మధ్య వ్యవహారమని తోసిపుచ్చింది.

కొద్దిరోజుల కిందట తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌, సిక్కింలో భారత్‌, చైనా సైనికులు పరస్పరం ఘర్షణలకు దిగారు. ఈ ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన అనేక మంది జవాన్లు గాయపడ్డారు. అప్పట్నుంచి లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. గాల్వాన్‌ లోయ, దెమ్‌చోక్‌, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ వంటి సున్నిత ప్రాంతాలకూ ఉద్రిక్తతలు పాకాయి. తాజాగా సరిహద్దుల్లో ప్రశాంతతకు భంగం కలిగించేలా వేల సంఖ్యలో సైన్యాన్ని చైనా తరలించింది. దీంతో భారత్‌ సైతం సరిహద్దు వద్ద సైనికులను భారీగా మోహరించింది.

ఇదీ చదవండి..

ఢీ అంటే ఢీ


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని