close

తాజా వార్తలు

Published : 26/06/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. ‘పాలు’ మార్కెటింగ్‌ కోసం అముల్‌తో జట్టు

పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం అముల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. చక్కెర కర్మాగారాలు, పాడి పరిశ్రమపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గౌతంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంస్థ అనుభవం, సాంకేతికత, మార్కెటింగ్‌ను వినియోగించుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ‘ప్రజలకు ఏం కావాలో భాజపాకు తెలుసు’

అభివృద్ధి పనుల వల్లే రెండోసారి మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. భాజపా మూడో వర్చువల్‌ ర్యాలీలో ఆమె మాట్లాడారు. అంత్యోదయ అనే మాటకు మోదీ ప్రభుత్వం అసలైన అర్థం చెబుతోందన్నారు.  పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుకు ఏడాదికి రూ. ఆరు వేలు ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో భాజపాకు తెలుసనని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

3. 1993 ముంబయి పేలుళ్ల నిందితుడు మృతి

1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యూసుఫ్ మెమన్ మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాసిక్‌ జైలులో ఈ రోజు ఉదయం మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం అతడు గుండెపోటుతో మరణించినట్టు సమాచారం. అయితే, యూసుఫ్ ఎలా మరణించాడనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ముంబయిలో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయిన‌ టైగర్‌ మెమన్‌కు యూసుఫ్‌ సోదరుడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఇక గ్యాస్‌ ధరలూ మార్కెట్‌కు లింక్‌

పెట్రోల్‌, డీజిల్‌ మాదిరిగానే గ్యాస్‌ ధరలనూ మార్కెట్‌ శక్తులకు అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధమైంది. దశలవారీగా గ్యాస్‌ ధరలపై నిర్ణయాధికారాన్ని వదిలేస్తామని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం చెప్పారు. వాటి ధరలను మార్కెట్‌కు అనుసంధానం చేస్తామని వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. అంతర్జాతీయ విమానాల రద్దు కొనసాగింపు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సాధారణ ప్రయాణికుల రైళ్ల సర్వీసులను ఆగస్టు 12 వరకు రద్దు చేసిన కేంద్రం.. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువునూ పొడిగించింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జులై 15 వరకు పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. శాంతి ఒప్పందాలకు చైనా తూట్లు: భారత్

తూర్పు లద్దాఖ్‌లో తన దుందుడుకు సైనిక చర్యల ద్వారా చైనా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి యుద్ధ పరిస్థితులు కల్పించి, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను దిగజారుస్తోందని భారత్ ఆరోపించింది. చైనా అధ్యక్షుడు, పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ షి జిన్‌పింగ్ 1993 నాటి శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచారని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఏడాదిలోపు కరోనా వ్యాక్సిన్‌: WHO

కరోనా వైరస్‌కు ఏడాదిలోపు సూది మందు వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గెబ్రెయేసస్‌ అన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాకు అంతర్జాతీయ సహకారం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. పర్యావరణం, ప్రజారోగ్యం, ఆహార భద్రతపై ఏర్పాటైన ఐరోపా పార్లమెంట్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మీ కన్నవారు ఎంత బాధపడతారో ఆలోచించండి

మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీసు శాఖ యువతను ఉద్దేశించి ట్విటర్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని కోరింది. దాంతో పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమ ప్రచారంలో భాగంగా నిర్వహించిన వెబినార్‌లో ప్రముఖ కథానాయకుడు చిరంజీవి పాల్గొన్నారు. అలాగే మాదకద్రవ్యాలకు అలవాటు పడొద్దంటూ కథానాయకులు నాని, సాయి ధరమ్‌తేజ్‌.. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడిన వీడియోలను ఏపీ పోలీస్‌ శాఖ ట్విటర్‌లో పెట్టింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. వచ్చేశాయి.. అమెజాన్‌ పే ‘స్మార్ట్‌ స్టోర్స్‌’ !

వ్యాపార దిగ్గజ సంస్థ అమెజాన్‌కు చెందిన ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో ‘స్మార్ట్‌ స్టోర్స్‌’ సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఆఫ్‌లైన్‌ దుకాణాల్లో కూడా కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులు చేయవచ్చని సంస్థ వివరించింది. ‘‘దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది స్థానిక దుకాణాలు ఇప్పటికే అమెజాన్‌ పే పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ దుకాణాల్లో వినియోగదారులకు మరింత ఉత్తమమైన అనుభూతినిచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. మా ‘స్మార్ట్‌ స్టోర్స్‌’ ద్వారా ఈ దుకాణాలు మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుతాయి.’’ అని అమెజాన్‌ పే సీఈఓ మహేంద్ర నెరూర్కర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మోదీ నిజాలు చెప్పాలి: రాహుల్‌ గాంధీ

గల్వాన్‌ వ్యాలీలోని భారత భూభాగంలోకి చైనా దళాల చొరబాటు, సైనికులపై దాడి ఘటనపై రాహుల్‌గాంధీ శుక్రవారం సైతం ప్రభుత్వంపై విమర్శలు కొనసాగించారు. భారత భూభాగంలోకి చైనా దళాలు ప్రవేశించకపోతే ఘర్షణలు ఎలా జరిగాయని 20 మంది సైనికులతో సహా ఓ కమాండింగ్ అధికారి ఎలా మరణించారని ప్రశ్నించారు. ఘటనపై ఇప్పటికైనా నిజాలు చెప్పాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.