close

తాజా వార్తలు

Published : 29/06/2020 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోటి దాటినా త‌ప్ప‌ని ముప్పు!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న వైర‌స్ విజృంభ‌ణ‌

ఇంట‌ర్నెట్ డెస్క్‌: కరోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో ఇప్ప‌టికే ప్ర‌పంచ‌దేశాలు విల‌విల‌లాడుతున్నాయి. విశ్వ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌ బాధితుల సంఖ్య కోటి దాటిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐదు ల‌క్ష‌ల మందిని పొట్ట‌న‌పెట్టుకున్న కొవిడ్ మ‌హ‌హ్మ‌రి ప‌లు దేశాల్లో విలయ‌తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టికే అమెరికా, యూర‌ప్ దేశాలు ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో తీవ్ర న‌ష్టాన్ని చ‌విచూస్తున్నాయి. తాజాగా లాటిన్ అమెరికా, భార‌త్ వంటి దేశాల్లో వైర‌స్ తీవ్ర‌త అనూహ్య రీతిలో పెరిగిపోతోంది. అయిన‌ప్ప‌టికీ ఈ ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆయా దేశాల్లో సాధార‌ణ ప‌రిస్థితుల‌ను తీసుకొచ్చేందుకు అక్క‌డి ప్ర‌భుత్వాలు కృషి చేస్తున్నాయి.  మ‌ళ్లీ వికృత‌రూపం దాల్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

అమెరికాలో కొన‌సాగుతున్న విజృంభ‌ణ‌..!

జాన్స్‌ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్ర‌కారం సోమ‌వారం నాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య కోటి దాట‌గా మ‌ర‌ణాల సంఖ్య 5ల‌క్ష‌లు దాటింది. వీటిలో కేవ‌లం ఒక్క అమెరికాలోనే ల‌క్షా 25వేల మంది మృత్యువాత‌ప‌డ్డారు. టెక్సాస్‌లో గ‌త కొన్ని రోజులుగా వైర‌స్ విజృంభ‌ణ తీవ్రరూపం దాల్చిన‌ట్లు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గ్రెగ్ అభాట్ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను సాధార‌ణ స్థితిలోకి తీసుకొచ్చే ప్రయ‌త్నంలో భాగంగా గ‌తనెల తొలివారంలో ఆంక్ష‌ల‌ను స‌డ‌లించారు. అయితే, తాజాగా వైర‌స్ తీవ్ర‌త అనూహ్యంగా పెర‌గడంతో శుక్ర‌వారం నుంచి తిరిగి బార్లు, రెస్టారెంట్ల‌ను మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించడం అక్క‌డి ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. ఇక వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో‌ ఫ్లోరిడా, ఆరిజోనాల‌లో వైస్ ప్రెసిడెంట్ మైక్ పాంపియో కూడా త‌న ఎన్నిక‌ల ప్రచారాన్ని కుదించుకొన్నారు.  బ‌య‌ట‌కు వెళ్లే సంద‌ర్భంలో ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా ముఖాల‌కు మాస్కులు ధ‌రించాల‌ని పాంపియో ప్ర‌జ‌ల‌కు విన్న‌వించారు. 

ఇదే త‌ర‌హాలో కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్ గావిన్ న్యూస‌మ్ ఆ రాష్ట్రంలోని లాస్ ఏంజెలిస్తోస‌హా ప‌లు ప్రాంతాల్లోని బార్ల‌ను మూసివేయాల‌ని ఆదేశించారు. వీటితోపాటు ఫ్లోరిడాలోని బీచ్‌లు కూడా కరోనా వైర‌స్ వ్యాప్తికి కొత్త క్ల‌స్ట‌ర్లుగా మారుతున్న‌ట్లు గుర్తించిన‌ అధికారులు, వెంట‌నే వాటిని మూసివేయాల‌ని నిర్ణయించారు. యువ‌త అనుస‌రిస్తున్న విధానాలే వైర‌స్ అత్యంత వేగంగా వ్యాపించ‌డానికి కార‌ణ‌మ‌వుతున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ రాన్ డీశాంటీస్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌భుత్వం సూచిస్తున్న జాగ్ర‌త్త‌లు పెడ‌చెవిన పెట్ట‌డంతో ప‌రిస్థితిలో మార్పు రావ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇక వాషింగ్ట‌న్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో రాష్ట్రంలో ఆంక్ష‌ల సడ‌లింపుకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌య్ ఇన్స్‌లీ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, క‌రోనా ధాటికి భారీ ప్రాణ‌న‌ష్టాన్ని చ‌విచూసిన న్యూయార్క్ రాష్ట్రంలో మాత్రం తాజాగా క‌రోనా వైర‌స్ మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌తంలో నిత్యం 800మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా ఆ సంఖ్య ఐదుకు చేర‌డం ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌యం. ఇక‌ ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్‌తో మ‌ర‌ణిస్తున్న ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రు అమెరికాలో ఉండ‌గా, బ్రెజిల్‌లో మాత్రం తొమ్మిది మంది బాధితుల్లో ఒక‌రు చొప్పున మ‌ర‌ణిస్తున్నారు.

యూర‌ప్‌ను వెంటాడుతున్న మ‌హ‌మ్మారి..
కొవిడ్ మ‌హ‌మ్మారికి దాదాపు యూర‌ప్ మొత్తం క‌కావిక‌లం అయిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, ఇట‌లీ దేశాలు వైర‌స్ ధాటికి వ‌ణికిపోయాయి. కేవ‌లం ఈ మూడు దేశాల్లోనే క‌రోనా వైర‌స్‌తో దాదాపు ల‌క్ష‌కుపైగా ప్ర‌జ‌లు మృత్యువాత‌ప‌డ్డారు. అయితే, గ‌త కొన్నిరోజులుగా  సెంట్ర‌ల్ ఇంగ్లిష్‌ న‌గ‌ర‌మైన లైసెస్ట‌ర్‌లో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో స్థానికంగా లాక్‌డౌన్ విధించే యోచ‌న‌లో బ్రిట‌న్ ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఇక్క‌డ లాక్‌డౌన్ విధిస్తే బ్రిట‌న్‌లో లాక్‌డౌన్ విధించిన తొలి న‌గ‌రంగా ఇది‌ నిలువ‌నుంది. 
యూర‌ప్‌లోని స్విస్ నైట్ క్ల‌బ్‌తోపాటు లైసెస్ట‌ర్ ప్రాంతాల్లో న‌మోద‌వుతున్న కొత్త క్ల‌స్ట‌ర్లు అక్క‌డ‌ వైర‌స్ తీవ్ర‌త త‌గ్గ‌లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. 

ఇక జ‌ర్మ‌నీలోని కబేళాల‌లో ప‌నిచేస్తున్న దాదాపు 1300మందికి కరోనా వైర‌స్ సోకడంతో ప్ర‌భుత్వ అప్ర‌మ‌త్త‌మైంది. దీంతో ప‌శ్చిమ భాగంలోని ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొన‌సాగిస్తున్నారు.‌ సాధార‌ణ ప‌రిస్థితులు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నంలో భాగంగా మ‌రో అడుగు ముందుకు వేసిన‌ పోలాండ్‌, ఫ్రాన్స్ దేశాలు స్థానిక ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌లో నిమ‌గ్న‌మ‌య్యాయి. ఈ స‌మ‌యంలో వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరాన్ని పాటించ‌డంతోపాటు త‌ప్ప‌నిస‌రిగా‌ శానిటైజ‌ర్లు వినియోగించ‌డం వంటి చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.‌

ఆఫ్రికాకు పొంచివున్న ముప్పు..!

ఇప్ప‌టికే అమెరికా, యూర‌ప్, ఆసియాల్లో విల‌య‌తాండ‌వం చేస్తున్న కరోనా మ‌హ‌మ్మారి తాజాగా ఆఫ్రికాలోనూ విజృంభిస్తోంది. ఆఫ్రికాలో ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 3ల‌క్ష‌ల 70వేల పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 9500మంది ప్రాణాలు కోల్పోయారు. కేవ‌లం ద‌క్షిణాఫ్రికాలోనే ఇప్పటివ‌ర‌కు ల‌క్షా 38వేల పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 2500 మంది మృత్యువాత‌ప‌డ్డట్లు ఆఫ్రికా వ్యాధి నియంత్ర‌ణ‌, నివార‌ణ కేంద్రం వెల్ల‌డించింది. తాజాగా న‌మోద‌వుతున్న కేసులను ప‌రిశీలిస్తే రానున్న ‌కొన్ని వారాల్లోనే అక్క‌డి ఆసుప‌త్రులన్నీ రోగుల‌తో నిండిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ద‌క్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ మంత్రి జ్వెలినీ మెఖిజే ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా దేశంలో కార్యాల‌యాల‌కు వస్తున్న‌వారితోనే వైర‌స్ తీవ్ర‌త పెరుగుతున్న‌ట్లు మెఖిజే అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇదిలా ఉంటే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజువారీగా నమోద‌వుతున్న కేసుల సంఖ్య నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. గ‌డిచిన 24గంట‌ల్లో 1,89,000 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు పేర్కొంది. గ‌త‌వారం క్రితం ఈ సంఖ్య ల‌క్షా 83వేలుగా ఉండ‌గా ఈవారం మ‌రింత పెరిగినట్లు డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

ఇక క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారికి కేంద్రమైన చైనాలో పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. దేశ రాజ‌ధాని బీజింగ్ వైర‌స్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా మార‌డంతో దాదాపు 83ల‌క్ష‌ల మందికి కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇక క‌రోనా వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉన్న భార‌త్‌లోనూ సోమ‌వారం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 5ల‌క్ష‌ల 48వేల‌కు చేరింది. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 16,475మంది మృత్యువాత‌ప‌డ్డారు.

ఇవీ చ‌దవండి..
వైర‌స్ విజృంభ‌ణ:  చైనాలో మ‌ళ్లీ లాక్‌డౌన్‌
2 కి.మీ దాటి వెళ్ల‌కండి ప్లీజ్‌..!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.