close

తాజా వార్తలు

Published : 06/07/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఏపీ: ఆగస్టు 15న ఇళ్ల స్థలాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లోని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం కొత్త తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 15న లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇంటి స్థలం పట్టాను మహిళ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తామని బొత్స వెల్లడించారు. మొత్తం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బొత్స తెలిపారు. వాస్తవానికి జులై 8న జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

2. కొవిడ్‌: రేపు తెలంగాణ గవర్నర్‌ సమీక్ష

ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో  తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సమీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష ఉంటుందని గవర్నర్‌ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌ ఐసోలేషన్‌ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రుల ప్రతినిధులతో ఈ సమీక్ష నిర్వహిస్తారు. కొవిడ్‌ చికిత్స, పడకలు, బిల్లులు, పరీక్షలు, ప్రజల సమస్యలపై గవర్నర్‌ చర్చిస్తారు.

3. ‘‘తెలంగాణలో అత్యుత్తమ టెక్స్‌టైల్‌ విధానం’’

తెలంగాణలో టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టబడులకు అవకాశాలున్నాయని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. టెక్స్‌టైల్, అపరెల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో నిర్వహించిన ఇన్వ్‌స్ట్ ఇండియా కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘టెక్స్‌టైల్ పెట్టుబడులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ తెలంగాణలో ఉంది. రాష్ట్రంలో అత్యుత్తమ టెక్స్‌టైల్‌ విధానం అమలు చేస్తున్నాం’’ అని  కేటీఆర్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఉద్రిక్తతల తగ్గింపులో పురోగతి: చైనా

గల్వాన్ ఘటన అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా పురోగతి సాధించినట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. జూన్‌ 30ప జరిగిన కమాండర్‌ స్థాయి చర్చల్లో  ఇరు దేశాలు బలగాల ఉపసంహరణకు అంగీకరించినట్లు వెల్లడించింది. సరిహద్దుల్లో చైనా బలగాలు వెనుతిరిగాయని భారత సైనిక వర్గాల పేర్కొన్న కొన్ని గంటల్లోనే చైనా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఎస్‌బీఐ కొత్త నిబంధనలు ఇవే

భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ)లో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధనలు వచ్చాయి. బ్యాంకు శాఖల్లో పరిమితికి మించి లావాదేవీలు నిర్వహిస్తే ఇకపై రుసుము కట్టాల్సి ఉంటుంది. కాగా చిన్న, నో ఫ్రిల్‌ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవు. సగటు నెలవారీ మొత్తం (ఏఎంబీ) రూ.25000 వరకు ఉండే ఖాతాదారుడు బ్యాంకు శాఖల్లో రెండుసార్లు మాత్రమే నగదు ఉపసంహరించుకొనేందుకు అవకాశం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించదు!

ఇటీవల కాలంలో కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనకు మరింత బలం చేకూర్చేలా 32 దేశాలకు చెందిన 239 మంది వైద్యుల బృందం డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాసింది. దీనికి స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నట్లు చెప్పడం గమనార్హం. అయితే  తాజాగా కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించేది కాదని  సెంట్రల్‌ సైన్స్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్ జనరల్‌ శేఖర్‌ మండే ఓ వార్త సంస్థతో చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. దేశంలో క‌రోనా పాజిటివ్ రేటు 6.73శాతం!

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా దేశంలో 7ల‌క్ష‌ల కేసులకు చేరువకావ‌డంతో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న దేశాలలో మూడో స్థానానికి చేరింది. ఈ స‌మ‌యంలో దేశంలో కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు పెంచ‌డం, కాంటాక్ట్ ట్రేసింగ్‌ను గుర్తించ‌డంతో పాజిటివ్ వ‌చ్చిన‌వారికి స‌కాలంలో వైద్య సేవ‌లు అందిస్తున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశంలో కొవిడ్-‌19‌ పాజిటివ్ రేటు 6.73శాతంగా ఉన్న‌ట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘‘కొల్లు రవీంద్ర ఎలాంటివారో అందరికీ తెలుసు’’

‘‘బీసీ నేతగా ఎదుగుతున్నారనే కొల్లు రవీంద్రపై కుట్ర పన్నారు. అగ్నికుల క్షత్రియ నేతను దెబ్బ తీయడానికే కుట్రలు పన్నుతున్నారు’’ తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. కొల్లు రవీంద్ర అరెస్టు గురించి దేవినేని మీడియాతో మాట్లాడారు. కొల్లు రవీంద్ర గోడ దూకి పారిపోయారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికి కథలు అల్లుతున్నారు అని దేవినేని అన్నారు. రవీంద్ర ఎలాంటివారో అందరికీ తెలుసు అని దేవినేని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రైతు భరోసా కేంద్రాలకు వైఎస్‌ఆర్‌ పేరు

రైతుల కోసం తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలకు వైఎస్‌ఆర్‌ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును పెడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇకనుంచి రైతు భరోసా కేంద్రాలను వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాలుగా పిలవనున్నట్లు తెలిపింది. 

10. అక్క‌డ‌ 100ఏళ్లలో తొలిసారి స‌రిహ‌ద్దులు మూత‌!

ప‌్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి తాజాగా ఆస్ట్రేలియాలోనూ విజృంభిస్తోంది. దీంతో అధిక జ‌నాభా క‌లిగిన రాష్ట్రాల స‌రిహ‌ద్దుల‌ను మూసివేస్తున్న‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. న్యూసౌత్ వేల్స్‌తో ఇత‌ర ప్రాంతాలకు రాక‌పోక‌ల‌ను నిషేధిస్తున్న‌ట్లు విక్టోరియా ప్రీమియ‌ర్ డేనియ‌ల్ ఆండ్రూస్ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఒకేరోజు 127 పాజిటివ్ కేసులు న‌మోదుకావడంతో పాటు ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోవ‌డంతో ఆండ్రూస్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.