లాభాలతో మొదలైన మార్కెట్లు..
close

తాజా వార్తలు

Published : 09/07/2020 10:02 IST

లాభాలతో మొదలైన మార్కెట్లు..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 సమయంలో సెన్సెక్స్‌ 123 పాయింట్లు లాభపడి 36,452 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 10,744 వద్ద కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. నిన్న అమెరికన్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నేడు ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు ఆతృతగా ఉన్నారు.  శంకర బిల్డింగ్స్‌, తేజస్‌ నెట్‌వర్క్‌, మాగ్మా ఫిన్‌ కార్ప్‌, సెంటీరియం క్యాపిటల్‌, సెయిల్‌ లాభపడగా.. ఫ్యూచర్‌ రిటైల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌, జైన్‌ ఇరిగేషన్‌, సుజ్లాన్‌ ఎనర్జీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  నేడు మొత్తం 19 కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని