close

తాజా వార్తలు

Updated : 14/03/2020 20:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వివాహం చేసుకున్న ‘పరుగు’ మూవీ హీరోయిన్‌

ఫొటో షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పరుగు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి షీలా. గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షీలా ఇటీవల వివాహం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పరిణయమాడారు. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం వేడుకగా జరిగింది. ఈ మేరకు భర్తతో దిగిన ఓ ఫొటోను ఆమె ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ఈరోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం.. మా గుండె లోతుల్లోని సంతోషం.. మేమిద్దరం కలిసి నూతన జీవితం ఆరంభించే ఓ కొత్త రోజు’ అని షీలా పేర్కొన్నారు.

2006లో విడుదలైన ‘సీతాకోకా చిలుక’ సినిమాతో షీలా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏడాదిలో విడుదలైన ‘రాజుభాయ్‌’ సినిమాలో మంచు మనోజ్‌ సరసన ఆమె నటించారు. కాకపోతే ఆ రెండు సినిమాలు షీలాకు ఆశించిన గుర్తింపు అందించలేకపోయాయి. అనంతరం ఆమె 2008లో విడుదలైన ‘పరుగు’ సినిమాలో బన్నీ సరసన ఆడిపాడారు. ఈ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ‘పరుగు’ చిత్రం తర్వాత వరుసగా ఎన్టీఆర్‌, రామ్‌, బాలకృష్ణ చిత్రాల్లో షీలా నటించారు. 2011లో విడుదలైన ‘పరమ వీర చక్ర’ సినిమా తర్వాత షీలా తెలుగు తెరకు దూరంగా ఉన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.