స్వీయ నిర్బంధంలోకి ప్రభాస్‌
close

తాజా వార్తలు

Published : 21/03/2020 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వీయ నిర్బంధంలోకి ప్రభాస్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడి

హైదరాబాద్‌: కథానాయకుడు ప్రభాస్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల జార్జియాలో షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇండియా వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘విదేశాల్లో సురక్షితంగా షూటింగ్‌ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత కొవిడ్‌-19 విజృంభిస్తున్న ఈ తరుణంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని నేను నిర్ణయించుకున్నా. మీరంతా కూడా సరైన జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నా’ అని ఆయన ప్రకటన విడుదల చేశారు.

‘సాహో’ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రభాస్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ కోసం చిత్ర బృందం ఇటీవల జార్జియా వెళ్లింది. అక్కడ చిత్రీకరణ పూర్తి చేసుకుని మూడు రోజుల క్రితం ఇండియా చేరుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న పూజా హెగ్డే, సహ నటుడు ప్రియదర్శి ఇప్పటికే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ క్రమంలో ప్రభాస్‌ నిర్ణయం తీసుకున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని