ఇది ఆరోపణల సమయం కాదు: ఈటల
close

తాజా వార్తలు

Published : 22/06/2020 02:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది ఆరోపణల సమయం కాదు: ఈటల

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంపై భాజపా నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. జన సంవాద్‌ సభ(వర్చువల్‌ ర్యాలీ)లో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆదివారం ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘ఇది పరస్పర ఆరోపణలు చేసుకునే సమయం కాదు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపణలు సరికావు. జాతీయస్థాయి నాయకుడు అయిన ఆయన ఒక గల్లీ లీడర్‌ మాట్లాడినట్లు మాట్లాడారు. కరోనా అనేది ప్రపంచ సమస్య. గుజరాత్‌లో కరోనా తీవ్రతపై ప్రధాని బాధ్యత వహిస్తారా? తెలంగాణలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. సీఎం కేసీఆర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కరోనాపై అన్ని రాష్ట్రాల కన్నా ముందే అప్రమత్తమయ్యాం. లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేశాం. తెలంగాణ ప్రభుత్వం చర్యలపై కేంద్ర బృందాలు హర్షం వ్యక్తం చేశాయి’’ అని ఈటల పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని