close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనా పరీక్షలయ్యాకే కాపురం

భర్తపై పోలీసులకు ఫిర్యాదు

ఆదోని: కరోనాపై ప్రజలు చైతన్యవంతులవుతున్నారు అనేందుకు నిదర్శనంగా నిలిచిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో డ్రైవరుగా పనిచేస్తూ 2 రోజులు క్రితం స్వగ్రామానికి వచ్చారు. కరోనా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో... వైద్య పరీక్షలు చేయించుకున్నాకే తమతోపాటు ఉండాలని ఆయన భార్య సూచించారు. అయినా భర్త వినలేదు. పరీక్షలు చేయించుకోకపోతే ఎలా... తనకూ, పిల్లలకూ కరోనా సోకుతుందేమోనని ఆమె గొడవ పడ్డారు. ఈ విషయమై శనివారం ఆదోని రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే వారిద్దరినీ ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అతనికి డాక్టరు లింగన్న ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి ఆదోనిలోని క్వారంటైన్‌ కేంద్రానికి పంపించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.