నిత్యావసరాలకు కొరత రానివ్వొద్దు: కేసీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 10/04/2020 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిత్యావసరాలకు కొరత రానివ్వొద్దు: కేసీఆర్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు. వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ వల్లే కరోనా వ్యాప్తి ఎక్కువగా జరగకుండా కట్టడి అయిందని సీఎం అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరాల కొరత లేకుండా చూడాలన్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీకి ప్రజలు సహకరించాలని కేసీఆర్‌ కోరారు. పట్టణ, ఇతర చోట్ల వలస కూలీల శిబిరాలను స్థానిక అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. వరికోతలు, ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లు యధావిధిగా జరపాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడంతో పాటు, వారు కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్ వచ్చిందని, వారికి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. పాజిటివ్ కేసులు ఎక్కువైనప్పటికీ అందరికీ చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.

లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉండడం వల్లే ఇతర దేశాల మాదిరిగా వైరస్ ఎక్కువగా విస్తరించడం లేదని, ఈ సత్యాన్ని గ్రహించి ప్రజలు సహకరించాలని కోరారు.

*లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసరాల కొరత లేకుండా చూడాలి. పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, మాంసం తదితర విక్రయాలు యధావిధిగా జరిగేలా చూడాలి. ఈ షాపుల వద్ద జనం ఒకే దగ్గర గుమికూడకుండా దూరం పాటించాలి.

* రేషన్ షాపుల ద్వారా నియంత్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. చెప్పిన సమయానికి వచ్చి, సామాజిక దూరం పాటించి బియ్యం పొందాలి. 

ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన దాని ప్రకారం రేషన్ కార్డున్న ప్రతీ కుటుంబానికి రూ.1500 చొప్పున నగదును బ్యాంకు ఖాతాలో వేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. అందరికీ డబ్బులు చేరతాయి. 

గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలను సరిగ్గా నిర్వహించాలి. రైతులు చెప్పిన సమయానికే వచ్చి, తమ ధాన్యం విక్రయించుకుని వెళ్లాలి. 
పట్టణ ప్రాంతాలు, ఇతర చోట్ల వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను, సహాయ కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని