లాక్‌డౌన్‌: పోలీస్‌స్టేషనే పెళ్లి మండపమైంది!
close

తాజా వార్తలు

Published : 23/04/2020 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌: పోలీస్‌స్టేషనే పెళ్లి మండపమైంది!

లఖ్‌నవూ: వారిద్దరికీ పెళ్లి కుదిరింది. వివాహం చేద్దామంటే జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. అయితే, గతంలో వరుడు చేసిన సాయానికి పోలీసులే వారికి ప్రత్యుపకారం చేశారు. వారి పెళ్లికి సాయపడ్డారు. చివరికి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని సిబ్బంది సమక్షంలో అనుకున్న సమయంలోనే వారిద్దరూ ఒక్కటయ్యారు. లాక్‌డౌన్‌ వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ పెళ్లి జరిగింది.

వరుడు అనిల్‌ది యూపీలో చందౌలి జిల్లా. పెళ్లి కుమార్తె జ్యోతిది ఘజీపూర్‌ జిల్లా. వీరికి ఏప్రిల్‌ 20న పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఉండడంతో ఇరు కుటుంబాలూ సందిగ్ధంలో పడ్డాయి. ఫిబ్రవరిలో జరిగిన ఓ బోటు ప్రమాద సమయంలో అనిల్‌ పోలీసులకు సహకారం అందించి వారి ప్రశంసలు పొందాడు. దాంతో ఆ పరిచయం కొద్దీ తన పరిస్థితిని వారికి వివరించడంతో పోలీసులు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి సోమవారం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఈ వివాహం జరిగింది. వరుడి తరఫు ఐదుగురు, వధువు తరఫు ఐదుగురితో పాటు స్టేషన్‌లోని ఏఎస్పీ సహా పలువురు పోలీసులు పాల్గొన్నారు. భౌతిక దూరం పాటిస్తూనే ఈ వివాహం జరిపించినట్లు స్టేషన్‌ అధికారి రాజేశ్‌కుమార్‌ తెలిపారు.

ఇవీ చదవండి..

చైనాపై అమెరికా కోర్టులో దావా

కిమ్‌ ఆరోగ్యంపై ఉత్తర కొరియా మౌనం

కిమ్‌ బాగుండాలని కోరుకుంటున్నా: ట్రంప్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని