ఊరి కలకు ఊపిరి
close

తాజా వార్తలు

Updated : 17/06/2020 10:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊరి కలకు ఊపిరి

  80 ఏళ్ల క్రితం ఇసుకలో పూడిపోయిన ఆలయం
  కరోనా వేళ.. యువత కృషితో బయటికి

చేజర్ల : కరోనా వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని తమ కల సాకారం చేసుకునేందుకు వినియోగించారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు యువకులు. పెన్నా ఒడ్డున ఉన్న పెరుమాళ్లపాడు ఇసుక మేటల ధాటికి 80ఏళ్ల కిందటే నది నుంచి రెండు మైళ్లు దూరం తరలింది. 200ఏళ్ల నాగేశ్వరాలయం మాత్రం అక్కడే మిగిలిపోయింది. కాలక్రమంలో ఆలయం కనిపించకుండా 35 అడుగుల ఎత్తుకు ఇసుక మేట వేసింది. గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో ఆ ఆలయం వెలికి తీయాలని అనుకున్నారు. సాధ్యం కాలేదు. ఎక్కడెక్కడో ఉన్న యువకులంతా కరోనా నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చారు. అందరూ చందాలు వేసుకుని అధికారుల అనుమతితో మంగళవారం యంత్రాలతో ఇసుక తొలగించారు. పరశురామ ప్రతిష్ఠిత నాగేశ్వరస్వామికి వేమన కుటుంబీకులు నిర్మించిన ఆలయం బయటపడింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని