ఇంటర్‌ కళాశాలల పనిదినాలు 196
close

తాజా వార్తలు

Published : 12/07/2020 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటర్‌ కళాశాలల పనిదినాలు 196

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌లో యూనిట్‌ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు దీన్ని తీసుకొస్తున్నారు. సబ్జెక్టుకు ఒక వర్క్‌బుక్‌ను ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలకు అనుగుణంగా బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలతో వీటిని రూపొందిస్తున్నారు.  ఆగస్టు 3 నుంచి కళాశాలలను ప్రారంభించేలా ఇంటర్‌ విద్యాశాఖ ఈ ఏడాది అకడమిక్‌ క్యాలండర్‌-2021ను సిద్ధం చేసింది. కళాశాలల్లో ఉదయం సైన్సు, మధ్యాహ్నం ఆర్ట్స్‌ గ్రూపులకు తరగతులు నిర్వహిస్తారు. తమ పరిస్థితులకు అనుగుణంగా కళాశాలలు వీటిని మార్పు చేసుకోవచ్చు. కళాశాలలు మొత్తం 196 రోజులు పని చేయనున్నాయి. సీబీఎస్‌ఈ తరహాలో 30% పాఠ్యాంశాలు తగ్గిస్తారు. రెండో శనివారమూ పని చేయాల్సి ఉంటుంది. పండగ సెలవులు ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటాయి. విద్యార్థులకు యూనిట్‌ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలకు వీడియోలను రూపొందిస్తారు. మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని