close

తాజా వార్తలు

Published : 28/10/2020 08:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉగ్రవాదుల జాబితాలో నగర వాసి

హైదరాబాద్‌: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఉగ్రవాదులుగా ప్రకటించిన 18 మంది జాబితాలో హైదరాబాద్‌కు చెందిన ఫర్హతుల్లా ఘోరీ పేరు ఉంది. అతను రెండు దశాబ్దాలుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇదీ ఘోరీ చరిత్ర..: మాదన్నపేట సమీపంలో ఉన్న కుర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్‌ అబు సూఫియాన్‌ 1998లోనే ఉగ్రవాదం వైపు అడుగేశాడు. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌(జేఈఎం) సానుభూతిపరుడిగా మారి భావసారూప్యం ఉన్న యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడం ప్రారంభించాడు. తొలుత దుబాయ్‌ పారిపోయి అక్కడ నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టి అనంతరం పోలీసు ఒత్తిడి పెరగడంతో పాకిస్థాన్‌ చేరుకున్నాడు. ప్రస్తుతం అక్కడ నుంచే పనిచేస్తున్నాడు. 2002లో గుజరాత్‌లోని అక్షరధామ్‌ ఆలయంపై జరిగిన ఉగ్ర దాడి కేసులో మొదటిసారి ఘోరీ పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కింది. భాజపా నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు పన్నిన కుట్రను 2004లో ఛేదించిన పోలీసులు అందులో అతని హస్తముందని నిర్ధారించారు. 2005 అక్టోబరులో నగరంలో గ్రీన్‌ల్యాండ్స్‌ సమీపంలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై జరిగిన మానవ బాంబు దాడి కేసులోనూ ఇతడే నిందితుడు. ఈ ఘటనలో హోంగార్డు మరణించాడు. ప్రస్తుతం లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) తరపున పనిచేస్తున్న ఘోరీ దేశంలో వరుస బాంబు దాడులతో హడలెత్తించిన ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) వ్యవస్థాపకుల్లో ఒకడైన అమీర్‌ రజాఖాన్‌కు సన్నిహితుడని నిఘా వర్గాలు గుర్తించాయి. దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనల్లో ఇతడి పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు.

రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌ పేర్లు కూడా..: 2007లో జరిగిన లుంబినీ పార్కు, గోకుల్‌ ఛాట్‌, 2013లో దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌ పేర్లూ కేంద్రం ప్రకటించిన ఉగ్రవాద జాబితాలో ఉన్నాయి. యాసిన్‌ భత్కల్‌కు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. కర్ణాటకకు చెందిన ఈ ముగ్గురూ దేశంలో అనేక పేలుళ్లకు సూత్రధారులు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.