CM Jagan: కోటి జనాభాకు మంచి జరిగే గొప్ప కార్యక్రమం

తాజా వార్తలు

Updated : 22/06/2021 12:41 IST

CM Jagan: కోటి జనాభాకు మంచి జరిగే గొప్ప కార్యక్రమం

వైఎస్సార్‌ చేయూత రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేసిన జగన్‌

అమరావతి: వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని జగన్‌ సర్కార్‌ విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కంప్యూటర్‌ మీట నొక్కి 23,14,342 మంది ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశారు. 45-60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తుంది. ఈ కార్యక్రమం సందర్భంగా జగన్‌ మాట్లాడారు.

‘మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఆర్థిక సాయంతోపాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి మహిళలకు వైఎస్సార్‌ చేయూత నిధులు అందిస్తాం. అర్హత ఉండి రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. కోటి జనాభాకు మంచి జరిగే గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాం. మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుందని ఈ పథకాన్ని చేపట్టాం’ అని జగన్‌ అన్నారు.

‘6 లక్షలకు పైగా ఉన్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు వైఎస్సార్‌ చేయూత ఇస్తున్నాం. వీరందరికీ సామాజిక పింఛన్ల ద్వారా లబ్ధి జరుగుతున్నా.. వైఎస్సార్‌ చేయూత అందిస్తున్నాం. వారి కాళ్లపై వారు నిలబడితే కుటుంబాలు బాగుంటాయని ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. రెండేళ్లలోనే వైఎస్సార్‌ చేయూత ద్వారా మహిళలకు దాదాపు రూ.9 వేలకోట్లు ఆర్థిక సాయం అందించాం. మహిళల్లో కొండంత ఆత్మవిశ్వాసం రావాలనే ఈ పథకం చేపట్టాం’ అని జగన్‌ వివరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని