250కి.మీ. ప్రయాణానికి ₹10 వేలు ఛార్జీ 
close

తాజా వార్తలు

Published : 14/05/2020 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

250కి.మీ. ప్రయాణానికి ₹10 వేలు ఛార్జీ 

నోయిడా: వందే భారత్ మిషన్‌లో భాగంగా స్వదేశానికి చేరుకున్న వారికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం షాకిచ్చింది. దిల్లీలో క్వారంటైన్ ముగించుకున్న వారు సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్‌ఆర్టీసీ) క్యాబ్, బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సేవలకుగాను వసూలు చేస్తున్న ఛార్జీలు మాత్రం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. 250 కి.మీ ప్రయాణానికి రూ.10,000 అద్దె వసూలుచేయనున్నట్లు వెల్లడించింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) నుంచి నోయిడా, ఘజియాబాద్‌తో పాటు 250 కి.మీ పరిధిలో ఎక్కడికి ప్రయాణించాలన్న సెడాన్‌ మోడల్ కారుకు రూ.10,000, ఎస్‌యూవీ మోడల్ కారుకు రూ.12,000 అద్దె చెల్లించాలని తెలిపింది. అలానే 26 సీట్లు ఉన్న బస్సులో 100 కి.మీ దూరానికి ఒక్కో ప్రయాణికుడి నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే క్వారంటైన్‌ ముగిసిన వలస కార్మికులకు మాత్రం ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు యూపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతంలో ఐజీఐఏ నుంచి నోయిడాకు క్యాబ్ సర్వీసులు కేవలం రూ. 800కు అందుబాటులో ఉండేవి. ప్రస్తుత లాక్‌డౌన్‌తో క్యాబ్ సేవలు రద్దవ్వడంతో, ప్రభుత్వమే కొన్ని క్యాబ్‌లను అందుబాటులో ఉంచింది. అయితే వాటికి యూపీ ప్రభుత్వం అధిక మొత్తంలో అద్దెలు నిర్ణయించడంపట్ల పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి...

ఆ టికెట్లన్నీ రద్దు: రైల్వేశాఖ

ఆయుర్వేదం.. వారంలో క్లినికల్‌ ట్రయల్స్‌ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని