దూబే అండ్‌ గ్యాంగ్‌.. ఏన్‌ ఎన్‌కౌంటర్‌ స్టోరీ!
close

తాజా వార్తలు

Updated : 10/07/2020 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దూబే అండ్‌ గ్యాంగ్‌.. ఏన్‌ ఎన్‌కౌంటర్‌ స్టోరీ!

వారం రోజుల్లో గ్యాంగ్‌స్టర్‌ సహా ఆరుగురు హతం

ఇంటర్నెట్‌డెస్క్‌: వికాస్‌ దూబే.. గత వారం రోజులుగా వార్తల్లో నిలుస్తున్న పేరు. జులై 3 వరకు యూపీ మినహాయిస్తే దేశవాసులకు ఇతడి గురించి తెలియదు. అలాంటిది 8 మంది పోలీసులను బలితీసుకున్న ఘటనతో ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పటి నుంచి ప్రతి రోజూ ఈ పేరు చుట్టూ ఏదో ఒక పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది. గ్యాంగ్‌స్టర్‌ అనుచరులు ఒక్కొక్కరుగా వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నేలకొరగ్గా.. చివరకు ప్రధాన నిందితుడు కూడా శుక్రవారం పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కాల్పుల్లో మృతిచెందాడు. ఈ ఘటనలో వికాస్‌ దూబే సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. వారం రోజుల పాటు సాగిన ఈ నాటకీయ పరిణామాలను ఓ సారి పరిశీలిస్తే.. 

జులై 3 రాత్రి సుమారు 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్‌ దూబేను అరెస్ట్‌ చేసేందుకు చౌబేపూర్‌ పోలీసులు బిక్రూ గ్రామానికి వెళ్లారు. పోలీసుల రాక సమాచారం ముందుగా అందుకున్న వికాస్‌ ముఠా సభ్యులు.. పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా,  ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మరణించారు. దీంతో వికాస్‌దూబేపై యూపీ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. ఎవరైనా వికాస్‌ ఆచూకీ చెబితే తొలుత రూ.50వేలు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అనంతరం దాన్ని రూ.5 లక్షలకు పెంచింది.

వరుస ఎన్‌కౌంటర్లు..

ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత నుంచి ఈ కేసుతో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరుగా హతమవుతూనే ఉన్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే దూబే అనుచరులైన (1) ప్రేమ్‌ ప్రకాశ్‌ పాండే, (2) అతుల్‌ దూబే పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. అయితే జులై 8న చిక్కినట్టే చిక్కిన వికాస్‌ దూబే.. త్రుటిలో తప్పించుకున్నాడు. అదే రోజు వికాస్‌ దూబే అనుచరుల్లో ఒకరైన (3) అమర్‌ దూబే ఉత్తర్‌ ప్రదేశ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. జులై 9న మరో ఇద్దరు అనుచరులు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మరణించారు. (4) కార్తికేయ అలియాస్‌ ప్రభాత్‌.. కాన్పూర్‌లో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇటావాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో (5) ప్రవీణ్‌ అలియాస్‌ బౌవా దూబే మరణించాడు. ఈ కేసులు ముఠా నాయకుడు అయిన వికాస్‌ దూబే గురువారం అరెస్ట్‌ అవ్వగా.. శుక్రవారం కాన్పూర్‌ తరలిస్తుండగా పోలీసు వాహనం బోల్తా పడగా.. తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో దూబే కూడా పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు.

అరెస్టులు.. సస్పెన్షన్లు

పోలీసులను హతమార్చిన ఘటన తొలి రోజు మొదలుకుని వికాస్‌ దూబే హతమయ్యే వరకు అతడి అనుచరుల, కుటుంబ సభ్యులైన 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే ఈ ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉండడంతో చౌబేపూర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ వినయ్‌ తివారీ, బీట్‌ ఇన్‌ఛార్జి కేకే శర్మను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలువురు పోలీసు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. కొందరిని బదిలీ చేశారు. వికాస్‌ దూబేను పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 25 బృందాలు గాలించాయి. మొత్తానికి వారం రోజుల్లో ఓ నేర సామ్రాజ్యం కూలినప్పటికీ.. రాజకీయ దుమారం మాత్రం కొనసాగుతూనే ఉంది! 

ఇదీ చదవండి..
వారి సంగతేంటి?.. విపక్షాల విమర్శలు

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని