పేదరికంలోకి 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు   
close

తాజా వార్తలు

Updated : 08/04/2020 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేదరికంలోకి 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు   

ఐఎల్‌ఓ నివేదిక

దిల్లీ: ప్రస్తుత కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) సంక్షోభం వల్ల భారత్‌లో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు పేదరికంలోకి వెళ్లొచ్చని అంతర్జాతీయ కార్మిక సమాఖ్య (ఐఎల్‌ఓ) నివేదికలో అంచనా వేసింది. కరోనా నియంత్రణకు ఏప్రిల్‌ 14 వరకు భారత్‌లో లాక్‌డౌన్‌ సహా ప్రకటించిన ఇతర చర్యలు ఉద్యోగాలు, ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడింది. ‘కొవిడ్‌-19 ఇప్పటికే కోట్ల మంది అసంఘటిత కార్మికులపై ప్రభావం చూపుతోంది. భారత్‌, నైజీరియా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది’ అని ఐఎల్‌ఓ పేర్కొంది. భారత్‌లో 90 శాతం మంది ప్రజలు అసంఘటిత రంగంలోనే ఉన్నారు.
80,000 ఉద్యోగాలు పోవచ్చు: రిటైలర్ల సంఘం
కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా రిటైల్‌ రంగంలో 80,000 వరకు ఉద్యోగాలు పోవచ్చని పరిశ్రమ సంఘం రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 768 రిటైలర్లతో ఈ సంఘం సర్వే నిర్వహించింది. చిన్న రిటైలర్లు 30 శాతం ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలిపింది. మధ్యస్థాయి రిటైలర్లు 12 శాతం, పెద్ద రిటైలర్లు 5 శాతం చొప్పున ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నాయని వెల్లడించింది. మొత్తంగా ఉద్యోగాల కోత 20 శాతం ఉండొచ్చని సర్వే స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని