close

తాజా వార్తలు

Published : 08/04/2021 07:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పురుషుడికి వితంతు పింఛను!

విచారణ చేపట్టిన అధికారులు

విచారణ చేపట్టేందుకు హజరైన అధికారులు

డోన్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: ఎక్కడైనా పురుషుడికి వితంతు పింఛను మంజూరవుతుందా.. ఠక్కున ఎవరిని అడిగినా వితంతు పింఛన్‌ మహిళలకు కదా అంటారు. కానీ డోన్‌ మండలంలో మాత్రం అధికారులు పురుషుడికి వితంతు పింఛను మంజూరు చేశారు. తీరా ఏళ్లు గడిస్తే కానీ గుర్తించని అధికారులు ప్రస్తుతం తప్పును గుర్తించి విచారణ చేపట్టారు. ఈ ఘటన డోన్‌ మండలం ఎద్దుపెంటలో చోటుచేసుకుంది. ఎద్దుపెంట గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తికి పెన్షన్‌ నెం. 113529781 ఐడీతో 2009లోనే పింఛన్‌ మంజూరు చేసినట్లు అధికారులు గుర్తించారు. కాశీం ఉపాధి నిమిత్తం కొంతకాలం గుంటూరు జిల్లాకు వలసవెళ్లారు. వినుకొండ నియోజకవర్గంలోని చిట్టాపురం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వద్దకు ఈనెల 4న పింఛను పొందేందుకు వెళ్లారు. అక్కడ కార్డును గుర్తించిన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వితంతు పింఛను నీకెలా వస్తుందని ప్రశ్నించటంతో ఆ వ్యక్తి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో అక్కడి అధికారి డోన్‌ మండలం ఎద్దుపెంట సచివాలయ అధికారులతో పాటు మండల అధికారులకు సమాచారం అందించారు. దీంతో పొరపాటును గుర్తించిన జిల్లా, స్థానిక అధికారులు దీనిపై విచారణ చేసేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు ఇన్నేళ్ల పాటు ఇంత నిర్లక్ష్యంగా పింఛన్‌ ఎలా ఇచ్చారు, ఇలాంటి పింఛన్లు ఇంకా ఏమైనా ఉన్నాయా తదితర విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఘటనపై డీఆర్‌డీఏ అధికారులు విచారణ చేపట్టారు. అసలు దీన్ని ఎవరు మంజూరు చేశారు, ఇన్నేళ్లు ఎలా పింఛను తీసుకున్నారనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. గ్రామానికి వెళ్లగా అక్కడ సంబంధిత వ్యక్తులు ఎవరూ లేకపోవటంతో అధికారులు వెనుతిరిగి వెళ్లినట్లు కార్యదర్శి మోహన్‌ఆచారి తెలిపారు. రెండునెలలుగా పింఛన్‌ ఇవ్వటంలేదని కార్యదర్శి మోహన్‌ఆచారి తెలిపారు.


వితంతు పింఛన్‌ మంజూరైన కార్డు



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని