ఎర్రదొంగల్నే బోల్తా కొట్టించారు!
close

తాజా వార్తలు

Updated : 12/04/2021 08:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎర్రదొంగల్నే బోల్తా కొట్టించారు!

స్వాధీనం చేసుకున్న దుంగలతో టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు

రుద్రవరం: రుద్రవరం మండలంలోని ఆర్‌.నాగులవరం గ్రామ సమీపంలోని 22వ బ్లాకు ఉపకాల్వ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు పట్టుకున్నారు. తిరుపతి ఎర్రచందనం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, తాలుకా పోలీసులు కలిసి ఆదివారం బయ్యర్లు(దుంగలు కొనేందుకు మఫ్టీలో)గా వచ్చి ఎర్ర దొంగలనే బోల్తా కొట్టించారు. నిందితుల వద్ద 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై ఆలీబాషా మాట్లాడుతూ తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ డీఐజీ క్రాంతిరాణటాటా ఆదేశాల మేరకు సమాచారం అందడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించామన్నారు. త్వరలో మిగతా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. పట్టుబడిన దుంగల విలువ రూ.5 లక్షలు ఉంటుంది. శిరివెళ్ల సీఐ చంద్రబాబునాయుడు, ఆళ్లగడ్డ గ్రామీణ ఎస్సై వరప్రసాదు, ఆళ్లగడ్డ పట్టణ ఎస్సై రామిరెడ్డి, శిరివెళ్ల ఎస్సై సూర్యమౌళి, పోలీసులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని