ఒకే మంచంపై మృతదేహం, బాధితుడు
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే మంచంపై మృతదేహం, బాధితుడు

అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కొవిడ్‌ విభాగంలో పడకల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఒకే మంచంపై ఇద్దరు రోగులను పడుకోబెట్టి ప్రాణవాయువు అందిస్తున్నారు. కణేకల్లు మండలానికి చెందిన సుంకన్న అనే వృద్ధుడు కొవిడ్‌ లక్షణాలతో ఊపిరాడని స్థితిలో గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరాడు. ఈయనకు పడక లేక ఓ యువకుడు ఉన్న పడకపైనే ఆక్సిజన్‌ పెట్టి చికిత్స అందించారు. కొద్ది గంటల్లోనే ఆ వృద్ధుడు మృతిచెందాడు. మృతదేహం ఉన్న పడకపైనే యువకుడు రెండు గంటల పాటు ఆక్సిజన్‌తో చికిత్స పొందిన దయనీయ పరిస్థితి ఇది.

- న్యూస్‌టుడే, అనంతపురం(వైద్యం)

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని