Vaccine: పెళ్లి సంబంధాల్లోనూ ‘టీకా’ వివరాలు
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: పెళ్లి సంబంధాల్లోనూ ‘టీకా’ వివరాలు


వార్తా పత్రిక మ్యాట్రిమోనీ పేజీలో వచ్చిన ప్రకటనలు

విల్లివాక్కం (తమిళనాడు): ‘కరోనా టీకాలు వేసుకున్న వరుడు, వధువు కావలెను’ అని ప్రకటనలు వెల్లడించే పరిస్థితిని కరోనా తీసుకొచ్చింది. పలు మ్యాట్రీమోనీ వెబ్‌సైట్‌లో వరుడు ఏం చదివాడు, ఎక్కడ పని చేస్తున్నాడని అడిగినట్టుగానే ‘కరోనా టీకా వేయించుకున్నాడా? అని అడిగే పరిస్థితి నెలకొంది. వరుని ఇంటి వారు కూడా ఇదే ప్రశ్న అడగనారంభించారు. దీనికి మరో మెట్టు పైకెక్కి వధూవరులు అవసరం అని వార్తా పత్రికలలో ప్రకటనలు ఇస్తున్న వారు ముందస్తు జాగ్రత్తగా ‘కరోనా టీకా వేసుకున్న వరుడు, వధువు కావలెను’ అని ప్రకటనలో కోరుతున్నారు. వివాహ వెబ్‌సైట్‌లలో వధూవరుల అవసరమని ప్రకటన చేస్తున్న వారు విద్యార్హత, ఆదాయంతో బాటు కరోనా టీకా వేసుకున్న వివరాలు కూడా తెలియజేస్తున్నారు. తద్వారా వివాహానికి వేచియున్న వారు కచ్చితంగా టీకాలు వేయించుకోవాల్సిన నిర్భంధం ఏర్పడింది. ఇది ఒక రకంగా ఆహ్వానించదగిన విషయమని వివరమెరిగిన వారు పేర్కొనడం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని