జంట యాంటీబాడీలతో కొత్త వేరియంట్లకు చెక్‌

తాజా వార్తలు

Published : 23/06/2021 08:34 IST

జంట యాంటీబాడీలతో కొత్త వేరియంట్లకు చెక్‌

వాషింగ్టన్‌: కరోనా కొత్త వేరియంట్లను యాంటీబాడీ కాక్‌టెయిల్‌తో కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు భిన్నరకాల యాంటీబాడీలతో కూడిన ఈ మిశ్రమం.. సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. మానవ రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం కొన్నిసార్లు ఆలస్యమవుతుంది. దీన్ని అధిగమించడానికి కృత్రిమంగా రూపొందిన మోనోక్లోనల్‌ యాంటీబాడీలను రోగులకు ఇస్తున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు.. ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అత్యవసర వినియోగ అనుమతిని పొందిన యాంటీబాడీ థెరపీలను విడివిడిగాను, కలిపి మిశ్రమాల రూపంలోనూ పరీక్షించారు. కరోనాలో కొత్తగా వచ్చిన ఆల్ఫా, బీటా, గామాతోపాటు భారత్‌లో మొదట వెలుగు చూసిన డెల్టా రకాన్ని పోలిన ఒక వేరియంట్‌పై వాటిని ప్రయోగించారు. రెండు రకాల యాంటీబాడీలతో కూడిన కొన్ని మిశ్రమాలు అనేక వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా వెల్లడైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని