ఔషధాల ‘టీ’

తాజా వార్తలు

Published : 16/04/2021 02:28 IST

ఔషధాల ‘టీ’

టీ, కాఫీలు ఎక్కువగా తాగడం ఒంటికి మంచిది కాదు కదా! వాటికి ప్రత్యామ్నాయంగా కరివేపాకు టీ తాగండి. అటు అలవాటు మానుకో అక్కర్లేదు. ఇటు ఆరోగ్యం కూడా!

రివేపాకు సువాసన నరాలను రిలాక్స్‌ చేస్తుంది. కాబట్టి రోజుకోసారి కరివేపాకు టీ తాగితే అలసట తగ్గిపోతుంది. ఒత్తిడినుంచి ఉపశమనం పొందుతారు.
* కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫెనోలిక్స్‌ చర్మ వ్యాధులను నయం చేస్తాయి. మధుమేహం ఉన్నవారు షుగర్‌ ఫ్రీ టీ తాగాలనుకుంటారు. అలాంటివారికి ఈ టీ మంచి ప్రత్యామ్నాయం. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది.
* ఆహారం జీర్ణమవక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ టీ తాగి చూడండి. ఉపశమనం లభిస్తుంది. అంతేనా ఈ టీ అరుగుదలకి మంచి ఔషధం కూడా.
టీ తయారుచేయండిలా:  ఓ గిన్నెలో నీరుపోసి బాగా మరిగించండి. తరువాత కడిగిన కరివేపాకు రెబ్బల్ని అందులో వేయండి. రంగు మారిన తర్వాత ఆ నీటిని ఫిల్టర్‌ చేయండి. దానికి కాస్త తేనె చేరిస్తే చాలు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని