
తాజా వార్తలు
నా పెళ్లికి అవే వేదికలు..
ఫొటోలతో ఫిదా చేస్తున్న నటి
హైదరాబాద్: ప్రకృతి అంటే తనకెంతో ఇష్టమని అంటున్నారు లెజెండ్ బ్యూటీ సోనాల్ చౌహాన్. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘లెజెండ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈమె తరచూ సోషల్మీడియా వేదికగా అభిమానులకు ఎంతో చేరువగా ఉంటున్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ తీసుకున్న ఎన్నో ఫొటోలను పలు సందర్భాల్లో ఇన్స్టా వేదికగా ఈమె అభిమానులతో పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సోనాల్ తన వ్యక్తిగత జీవితం, వివాహం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నాకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. మన జీవితాల్లో పర్యావరణం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రకృతిని మించి నాకు ఆనందాన్ని ఇచ్చేది మరొకటి లేదు. పక్షుల కిలకిలరావాలు వినడం కోసమే తెల్లవారుజామున నిద్రలేస్తాను. నా వివాహం రెండు చోట్ల జరగాలని ఆశిస్తున్నాను. సాగర తీరం ఓ వేదికగా.. కొండ ప్రాంతం మరో వేదికగా నా వివాహం జరగాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పటివరకూ నాకు కావాల్సిన లక్షణాలున్న జీవిత భాగస్వామి ఎదురవలేదు.’ అని సోనాల్ చౌహాన్ తెలిపారు.
ఇదీ చదవండి
నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్