close

తాజా వార్తలు

Published : 11/02/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా మొదటి రోజులు అత్యంత కీలకం: యూఎస్

భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు పునరావృతం కాకుండా...

వాషింగ్టన్‌: ‘ఈ ప్రపంచం కరోనా మహమ్మారి ప్రారంభమైన రోజుల గురించి సాధ్యమైనంతవరకు తెలుసుకోవడం అత్యంత అవసరం. దాని వల్ల వైరస్‌కు మూలం ఏంటో అర్థం చేసుకోగలుగుతాం. మరోసారి ఇలాంటి మహమ్మారులు పునరావృతం కాకుండా నివారించగలం’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం  ప్రకటన అనంతరం అమెరికా స్పందించింది. పారదర్శకత కోసం ఆ బృందం సిద్ధం చేసిన నివేదికను బయటపెట్టాలని కోరింది.  ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్.. ఒక జంతువు నుంచే మానవులకు వ్యాపించి ఉంటుందని, వైరాలజీ ల్యాబ్‌ నుంచి లీకై, మానవుల్లోకి వ్యాపించడానికి ఆస్కారం లేదని నిపుణుల బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే. 

చైనాలో వుహాన్‌ నగరంలో తొలిసారి కరోనా వైరస్ వెలుగుచూసింది. అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని కమ్మేసింది. దాంతో ఆ దేశంలోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఈ వైరస్ లీకైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అగ్రదేశం అమెరికా ఈ మహమ్మారి ధాటికి వణికిపోయింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘చైనా వైరస్‌’ అంటూ ఆ దేశంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆరోగ్య సంస్థ పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ దాన్నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ వాదనలన్నింటిని  చైనా ఖండిస్తూ వచ్చింది. ఈ క్రమంలో వైరస్ మూలాలను కనుగొనేందుకు ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం దర్యాప్తు చేసి..జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకిందని వెల్లడించింది. కాగా, దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ‘మహమ్మారి ప్రారంభ రోజులకు సంబంధించిన సమాచారంపై చైనా, ఆరోగ్య సంస్థ తీరుపై ఇప్పటికే మేం మా ఆందోళన వ్యక్తం చేశాం. కరోనా ప్రారంభ దశ గురించి ప్రపంచం సాధ్యమైనంత ఎక్కువ తెలుసుకోవడం అత్యంత అవసరం. దాని వల్ల భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు పునరావృతం కాకుండా నివారించగలం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. కాగా, చైనా కరోనా అంశంపై జోబైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం నుంచి మొదటి సారి వచ్చిన స్పందన ఇది. 

ఇవీ చదవండి:

కరోనా మూలం చైనా ల్యాబ్ కాదు



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని