
తాజా వార్తలు
1.65 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు
24 గంటల్లో 11,666 కొత్త కేసులు..123 మరణాలు
దిల్లీ: రోజూవారీ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ..దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. బుధవారం 7,25,653 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..11,666 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోల్చుకుంటే కొత్త కేసుల నమోదులో 8 శాతం తగ్గుదల కనిపించింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,07,01,193కి చేరింది.
ఇక దేశంలో రికవరీ రేటు 97 శాతానికి చేరువకాగా.. క్రియాశీల రేటు 1.65 శాతానికి తగ్గింది. నిన్న 14,301 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా 1,03,73,606 మంది ఆ వైరస్ నుంచి బయటపడ్డారు. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 1,73,740కి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 123 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యు ఒడికి చేరుకున్నారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,53,847కి చేరింది. మరోవైపు, జనవరి 27 నాటికి 23,55,979 మంది కొవిడ్ టీకాలు వేయించుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి:
త్వరలోనే సింగిల్ డోసు టీకా ఫలితాలు!