
తాజా వార్తలు
గన్నవరంలో విమాన సర్వీసులకు అంతరాయం
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమాన సర్వీసులకు గురువారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేకువజాము నుంచే దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా ముందు ఏముందో కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉదయం 7.20 గంటలకు రావాల్సిన దిల్లీ, బెంగళూరు సర్వీసులు రెండు గంటలు అలస్యమయ్యాయి. వాతావరణం అనుకూలించిక పోవడంతో గన్నవరం చేరుకున్న స్పైస్ జెట్, ఇండిగో విమానాలు దాదాపు అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.
ఇవీ చదవండి..
మళ్లీ మూలాల్లోకి!
ట్రంప్ అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
Tags :