
తాజా వార్తలు
తేజస్.. వాయుసేనకు వజ్రాయుధం
వాయుసేన విశ్రాంత స్వ్కాడ్రన్ లీడర్ కాళిదాసుతో ముఖాముఖి
ఇంటర్నెట్ డెస్క్: ఆత్మనిర్భర భారత్ అభియాన్ ద్వారా సుమారు రూ.45 వేల కోట్లతో 83 తేజస్ స్వదేశీ యుద్ధ విమానాలను సమకూర్చుకునేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం రక్షణ రంగంలో కీలకమని భారత వాయుసేన విశ్రాంత స్వ్కాడ్రన్ లీడర్ మాధవపెద్ది కాళిదాసు అభిప్రాయపడ్డారు. స్వదేశీ యుద్ధ విమానాల వల్ల నిరంతర సర్వీసింగ్, అప్‌గ్రేడ్స్ సులువవుతుందన్నారు. తేజస్ సామర్థ్యాన్ని వివిధ రూపాల్లో పరీక్షించాకే కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారంటున్న కాళిదాసుతో ముఖాముఖి.
తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు రక్షణ రంగానికి ఏవిధంగా దోహదపడుతుంది? ఎంతమేరకు సైనిక రంగాన్ని బలోపేతం చేస్తుంది?
తేజస్ యుద్ధ విమానాలను అన్ని రకాలుగా పరీక్షించాకే వాటి సామర్థ్యాన్ని, పని తీరును క్షుణ్నంగా విశ్లేషించిన తర్వాత అలాంటి మరో 83 విమానాలను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు మనకు ఉన్న యుద్ధ విమానాలు మిగ్ సిరీస్‌లతోపాటు జాగ్వార్, మిరాజ్-2000, ఇటీవల ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ ఇవ్వన్నీ దిగుమతి చేసుకున్నవే. మన విమానాలను మనమే తయారు చేయాలన్న కల ఇప్పుడు పరిపూర్ణంగా సాకారం కానుంది. స్వదేశీ విమానం ద్వారా దిగుమతులు తగ్గించవచ్చు.
యుద్ధ విమానాల డిజైన్, డెవలప్మెంట్, ఉత్పత్తితో దేశీయ సంస్థలకు ఉన్న సామర్థ్యాన్ని ఏ విధంగా విశ్లేషించవచ్చు?
హెచ్ఏఎన్, డీఆర్డీఓ, ఎడాతోపాటు 400 నుంచి 500 దేశీయ, ప్రైవేటు సంస్థలు కలిసి ప్రోటోటైప్‌ను తయారు చేస్తున్నారు. ఈ ప్రోటోటైప్‌ను అనేక రకాలుగా పరీక్షిస్తారు. ఎయిర్ షోలు, గగన్ శక్తి వంటి విన్యాసాల్లో ఈ విమానాల పనితీరును క్షుణ్నంగా పరిశీలిస్తారు. టార్గెట్‌పైకి ఆయుధాల ప్రయోగం, వాటి కచ్చితత్వం, వివిధ సందర్భాల్లో ఈ విమానాల పనితీరు పరీక్షించి సంతృప్తి చెందిన తరువాతనే ఆ విమానాలను భారత వాయుసేన తన దళంలోకి చేర్చుకుంటుంది.
పాకిస్థాన్ లాంటి దేశాల్లో ఉన్న యుద్ధ విమానాలతో పోలిస్తే తేజస్‌కు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?
తేజస్ చాలా బరువు తక్కువగా ఉంటుంది. దీని వల్ల అది చురుకైన కదలికలు చేయగలదు. దీంతో శత్రు దేశానికి చెందిన రాడార్, మిస్సైల్ వ్యవస్థను చిక్కకుండా తప్పించుకుంటూ వారిపై దాడి చేయగలదు.
ఇవీ చదవండి...
కట్టుదిట్టమైన భద్రతా వలయంలో దిల్లీ
రైలెక్కలేకపోయారా.. టికెట్ సొమ్ము వెనక్కి!
మరింత సమాచారం కోసం కింది వీడియోను చూడండి..