close

తాజా వార్తలు

Published : 05/01/2021 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాద్రాను రెండో రోజూ విచారించిన అధికారులు

]

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాను ఆదాయపుపన్ను శాఖ అధికారులు వరుసగా రెండో రోజూ ప్రశ్నించారు. బినామీ ఆస్తుల కేసుకు సంబంధించి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.45 ప్రాంతంలో దిల్లీలోని వాద్రా నివాస స్థలం సుఖదేవ్‌ విహార్‌కు చేరకున్న అధికారులు.. బినామీ ఆస్తుల గురించి ఆరా తీశారు. ఇదే అంశంపై సోమవారం కూడా దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.  బ్రిటన్‌లో అప్రకటిత ఆస్తులు, నగదు అక్రమ చలామణి ఆరోపణలకు సంబంధించి వాద్రాపై ఐటీ, ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. రాజస్థాన్‌లోని బికనేర్‌లో వాద్రాకు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి ప్రశ్నలు సంధించారు. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టంలోని నిబంధనలను అనుసరించి వాద్రా చెప్పిన సమాధానాలను నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఐటీ కార్యాలయానికే వాద్రా వెళ్లాల్సి ఉంది. అయితే, కొవిడ్‌-19 నిబంధనల కారణంగా రాలేకపోతున్నానని తెలపడంతో అధికారుల బృందమే వాద్రా నివాసానికి వెళ్లింది.


 



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని