close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 06/04/2020 11:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

ఆత్మవిశ్వాసంతో కరోనాను ఎదుర్కొందాం

హైదరాబాద్‌: దేశమంతా ఒక్కటై కరోనా వైరస్‌ను తరిమికొట్టాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పిలుపునిచ్చారు. 130 కోట్ల మంది భారతీయులు ఐక్యతను చాటడమే దివ్వెల వెలుగు కార్యక్రమమని అన్నారు. కరోనాను తరిమికొట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు సంఘీభావంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కుటుంబ సమేతంగా 130 దివ్వెలు వెలిగించి ఐక్యత చాటారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో కరోనాను ఎదుర్కొందామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీపాలు వెలిగించడం ద్వారా శాస్త్రీయ ప్రయోజనాలు కలుగుతాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో దాన్ని నియంత్రించేందుకే లాక్‌డౌన్‌ ప్రకటించారని ఈ సందర్భంగా గవర్నర్‌ గుర్తు చేశారు. ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దని.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని గవర్నర్‌ సూచించారు.  


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.