బిట్టు శ్రీనుకు జ్యుడిషియల్‌ రిమాండ్‌
close

తాజా వార్తలు

Published : 09/03/2021 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిట్టు శ్రీనుకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

మంథని: హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనుకు మంథని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఏడు రోజుల కస్టడీ ముగియడంతో నిందితుడిని పోలీసులు ఇవాళ కోర్టులో హజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని వరంగల్‌ జైలుకు తరలించారు. న్యాయవాద దంపతుల హత్యకేసులో నిందితులకు బిట్టు శ్రీను మారణాయుధాలు, వాహనం సమకూర్చాడని.. కుంట శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళికలు వేసినట్లు అభియోగాలున్నాయి.

హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతులను గత నెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద రోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దంపతుల హత్య కేసుకు సంబంధించి బిట్టు శ్రీనుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ముగ్గురిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. ఇవాళ బిట్టు శ్రీనును న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని