
తాజా వార్తలు
ఉరివేసుకొని బిగ్బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య
బెంగళూరు: కన్నడ నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య ఆత్యహత్య చేసుకుంది. బెంగళూరు.. మగది రోడ్డులోని ప్రగతి లేఅవుట్లో ఉన్న తన ఇంట్లో ఆమె సోమవారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాలడ్పిందని బెంగళూరు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కాగా.. గతేడాది జయశ్రీ చేసిన ఒక ఫేస్బుక్ పోస్టుతో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ‘నేను నిష్క్రమిస్తున్నా. ఈ చెడ్డ ప్రపంచానికి, నిరాశకు వీడ్కోలు’ అని 2020 జులై 22న ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసింది. ఆ తర్వాత ఆ పోస్టు తొలగించి ‘నేను బాగానే ఉన్నాను. లవ్యూ ఆల్’ అంటూ మరో పోస్టు చేసింది. జయశ్రీ కన్నడ బిగ్బాస్ సీజన్3లో పాల్గొంది. 2017లో ‘ఉప్పు హులీ ఖారా’ చిత్రం ద్వారా కన్నడ చిత్రసీమకు పరిచయం అయింది. ఇదిలా ఉండగా ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి..