
తాజా వార్తలు
తాడాటా? తేలుతున్నారా??
ఇంటర్నెట్ డెస్క్: స్కిప్పింగ్ లేదా తాడాట.. ఇదంటే పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరికీ ఇష్టమే. దీనిని సాధారణంగా సింగిల్‌గా లేదా ఇద్దరు, ముగ్గురు కలిసి ఆడుతుంటారు. మరి ప్రపంచ రికార్డు రేంజ్లో తాడాట ఆడటం ఎలాగో తెలిపే వీడియోను.. గిన్నిస్ బుక్ ఆప్రికార్డ్స్ సంస్థ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.
ఒకే తాడుతో, ఒక్క నిముషంలో బృందంగా కలిసి అతి ఎక్కువ స్కిప్స్ చేసినందుకు వీరికి ప్రపంచ రికార్డు దక్కింది. దీనిని చూసిన నెటిజన్లు ఈ పిల్లలు తాడాట ఆడుతున్నారా లేదా ఊరికే గాలిలో తేలుతున్నారా? అదీ కాదంటే ఈ వీడియోను ఫాస్ట్ ఫార్వార్డ్ చేయలేదు కదా.. అంటూ తెగ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేహం మీక్కూడా వచ్చిందో లేదో.. 15 సెకెన్ల పాటు సాగే ఈ వీడియోను రెప్పార్పకుండా చూసి చెప్పండి మరి!
ఇదీ చూడండి..
Tags :