ఏసీ కంప్రెషర్ పేలి వ్యక్తి మృతి
close

తాజా వార్తలు

Published : 11/03/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏసీ కంప్రెషర్ పేలి వ్యక్తి మృతి

బాలానగర్‌: ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్న ఏసీ కంప్రెషర్‌ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన సలీం పాషా, హైదరాబాద్‌ రాంనగర్‌కు చెందిన మహమ్మద్‌ సమీర్‌లు నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. బాలానగర్‌లో సర్వీసింగ్‌ చేసేందుకు ఏసీ కంప్రెషర్‌ను బైక్‌పై తీసుకెళ్తున్నారు. ద్విచక్ర వాహనంపై బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ చౌరస్తా నుంచి బాలానగర్‌ వెళ్తున్న క్రమంలో మారుతీ నెక్సా షోరూం వద్దకు చేరుకోగానే ఇద్దరి మధ్య ఉన్న కంప్రెషర్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో వాహనం వెనకాల కంప్రెషర్‌ పట్టకుని కూర్చున్న సలీం పాషా అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం నడుపుతున్న మహమ్మద్‌ సమీర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయాలపాలైన సమీర్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని