చంద్రబాబు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు: బొత్స
close

తాజా వార్తలు

Published : 01/05/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంద్రబాబు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు: బొత్స

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి చట్టం చేసిందని.. రాష్ట్రంలో మూడు రాజధానులను ప్రజలంతా అంగీకరించారన్నారు. ప్రజలు ఆమోదించారు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు పట్టం కట్టారన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ విధానమని.. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని బొత్స భరోసా కల్పించారు. న్యాయస్థానాలకు వెళ్లడం వల్లే అమరావతిలో ప్లాట్ల అభివృద్ధి ఆలస్యమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు అబద్ధాలు చెబుతూ.. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా కష్టపడి, ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. ఉద్యోగులు అన్ని విషయాలకు అంగీకరించి విధులకు హాజరవుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్‌ హోం సాధ్యమవుతుంది. క్షేత్ర స్థాయిలో చేయాల్సిన పనులు ఉన్నందున  ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌ హోం సాధ్యపడదు. చంద్రబాబు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు’’ అని బొత్స తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని