బ్యాంకులు పనితీరును మార్చుకోవాలి: కన్నబాబు
close

తాజా వార్తలు

Updated : 26/03/2021 22:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకులు పనితీరును మార్చుకోవాలి: కన్నబాబు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.31 లక్షల కోట్లను క్రెడిట్ ప్లాన్‌గా నాబార్డు నిర్ధారించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.కన్నబాబు తెలిపారు. రూ.1.58 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలుగా నిర్ధారించారని.. ఇందులో ప్రత్యేకంగా రూ. 1.13 లక్షల కోట్లు కేవలం పంట రుణాలుగా ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి వెల్లడించారు. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఇప్పటికీ వెనకాడుతున్నారని.. ఈ విషయంలో బ్యాంకులు పనితీరును మార్చుకోవాలని సూచించారు. 4 లక్షలకుపైగా రైతులకు సీసీఆర్ కార్డులు జారీ చేశామని కన్నబాబు వెల్లడించారు.

రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు కన్నబాబు చెప్పారు. రూ.2,900 కోట్లతో ఈ పార్కులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. రైతులు పండించే ఉత్పత్తులకు కనీస మద్దతుధరతో పాటు వాటికి విలువ దక్కాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా ప్రాథమిక స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనికి సంబందించి రూ.13వేల కోట్లతో ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని