అద్భుతమైన ఇళ్లు ఇస్తున్నాం: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 15:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అద్భుతమైన ఇళ్లు ఇస్తున్నాం: కేటీఆర్‌

సిరిసిల్ల: గతంలో పేదలకు డబ్బా ఇళ్లు కట్టించి ఇచ్చారని, మూడు రంగుల ఇళ్ల కోసం మూడు చెరువుల నీళ్లు తాగించారని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పేదలకు అద్భుతమైన ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. గతంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.70 వేలు ఖర్చు చేశారు. ఇప్పుడెంత ఖర్చు చేస్తున్నాం? అని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనలో భాగంగా మోహినికుంటలో సింగిల్‌విండో పెట్రోల్‌ బంకును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం 2 పడకగదుల ఇళ్లు ప్రారంభించారు. రైతు వేదికను ప్రారంభించి..ఉత్తమ పంచాయతీ అవార్డుకు ఎంపికైన మోహినికుంట పాలకవర్గాన్ని సన్మానించారు. సిరిసిల్ల జిల్లాకు 6,886 రెండు పడకగదుల ఇళ్లు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని