నమ్మకాన్ని వమ్ము చేయను: వాణీదేవి
close

తాజా వార్తలు

Updated : 21/03/2021 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నమ్మకాన్ని వమ్ము చేయను: వాణీదేవి

హైదరాబాద్‌: తనకు అప్పగించిన గురుతర బాధ్యతను నిష్టతో నెరవేరుస్తానని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని పీవీ ఘాట్‌ వద్ద వాణీదేవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెరాస ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చానని.. పెద్దగా ప్రచారం చేయకపోయినా ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుకోసం కృషి చేసిన కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులకు వాణీదేవి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి పీవీ నరసింహారావుకు తెరాస ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇస్తోందన్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని