close

తాజా వార్తలు

కొనసాగుతున్న లెక్కింపు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికలు జరిగిన 120 పురపాలక సంఘాలు, 9 నగరపాలక సంస్థల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2,647 మంది వార్డు సభ్యులు, 324 కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. మొత్తం 12,926 మంది అభ్యర్థుల భవిత్యం సాయంత్రానికల్లా తేలనుంది. ఇప్పటికే 80 మంది వార్డు సభ్యులు, ఒక కార్పొరేటర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 27న మేయర్‌లు, డిప్యూటీ మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌లు, వైస్‌ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక జరగనుంది. ఒక్కో వార్డుకు సగటున నలుగురు అభ్యర్థులు పోటీపడుతుండగా డివిజన్‌లలో ఈ సంఖ్య ఐదుగా ఉంది. సుమారు 10 వేల మంది ఉద్యోగులు ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొన్నారు. పురపాలక సంఘాల్లో దాదాపు 30 లక్షల మంది, నగరపాలక సంస్థల్లో (కరీంనగర్‌ కాకుండా) సుమారు ఎనిమిది లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.