
తాజా వార్తలు
Day12: ఆ 5 రాష్ట్రాల్లో అత్యధికంగా వ్యాక్సినేషన్
దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. 12వ రోజైన బుధవారం 28 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ ఒక్కరోజే 5,038 కేంద్రాల్లో 2,99,299 మంది (సాయంత్రం ఆరు గంటల వరకు) ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ పొందినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 23.28 లక్షల మందికి వ్యాక్సిన్ అందినట్లు పేర్కొంది.
కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇవాళ పెద్దఎత్తున టీకాలు వేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇవాళ వేసిన 3 లక్షల టీకాల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటానే 79 శాతమని వివరించింది. కేవలం 123 మందిలో మాత్రమే ప్రతికూల ప్రభావాలు కనిపించాయని తెలిపింది. వీరిలో 16 మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 9 మంది మరణించగా.. వారెవరికీ కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదని ప్రకటించింది.
ఇవీ చదవండి..
కొవాగ్జిన్: బ్రిటన్ రకంపైనా సమర్థవంతంగా..!
భారత్ : 97 శాతానికి చేరిన రికవరీ రేటు..