close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. మేం అమలు చేయం

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు తాజాగా నిరసన గళం వినిపించారు. ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని.. దాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ఉద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తిరస్కరించే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేవని కేంద్ర హోంశాఖ సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మీరు నేర్పుతారా? మేం నేర్పాలా?

న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ప్రభుత్వ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం, ఉదాసీనతపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఎలా అమలు చేయాలో నేర్చుకుంటారా? లేదంటే మమ్మల్ని నేర్పమంటారా? అంటూ అడ్వొకేట్‌ జనరల్‌ను ఉద్దేశించి ప్రశ్నించింది. ఓ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై అప్పీలు దాఖలు చేయడంలో జరిగిన జాప్యానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. పింఛను అర్హత వయసు 60 ఏళ్లకు తగ్గింపు

వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద సామాజిక భద్రత పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు ఏపీ ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటికే కుటుంబంలో ఒక వ్యక్తి పింఛను పొందుతున్నా, 80% వైకల్యం కలిగిన వారు ఉంటే వారికి రెండో పింఛను ఇవ్వనున్నారు. డయాలసిస్‌ రోగులు, తీవ్ర మానసిక సమస్యలు ఉన్న వారు, ఎయిడ్స్‌ రోగులకు అదనంగా సాయం అందిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రాజధాని అమరావతే

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి నుంచి రాజధానిని మార్చే ప్రతిపాదన లేదని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విస్పష్టం చేశారు. శాసనమండలి సభ్యులు పి.శమంతకమణి, జి.దీపక్‌కుమార్‌, పి.అశోక్‌బాబు శుక్రవారం అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఇకపై 4 రోజుల్లోనే!

వాహనం విక్రయించామా.. చేతులు దులుపుకొన్నామా అనే ధోరణి ఇకపై చెల్లదు. రిజిస్ట్రేషన్‌ తర్వాత హైసెక్యూరిటీ సంఖ్యా నామ ఫలకాన్ని ఇకపై నాలుగు రోజుల్లోనే వాహనాలకు సంబంధిత డీలర్లు బిగించాలి. లేదంటే వారిపై చట్టపరమైన చర్యలను రవాణాశాఖ తీసుకోనుంది.. ఈ విషయమై గ్రేటర్‌ వ్యాప్తంగా వాహన డీలర్లతో ఆర్టీఏ అధికారులు సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 971 కంపెనీల గుర్తింపు రద్దు

ఏపీలో డొల్ల (షెల్‌) కంపెనీలను నియంత్రించటమే లక్ష్యంగా వరుసగా రెండేళ్లు వార్షిక నివేదికలు సమర్పించని 971 కంపెనీల గుర్తింపును రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) రద్దు చేసింది. వాటి బ్యాంకు ఖాతాలను స్తంభింప (ఫ్రీజ్‌) చేసింది. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సుమారు 30 వేల కంపెనీలు ఆర్‌వోసీలో రిజిస్టర్‌ చేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పిల్లలకు కొవ్వు పదార్థాలు అమ్మొద్దు

కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను పాఠశాలల క్యాంటీన్లలో, మెస్‌లలో, హాస్టళ్లలో విద్యార్థులకు అమ్మకుండా నిషేధించే నిబంధనలను ‘భారత ఆహార భద్రతా ప్రమాణాల మండలి’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) రూపొందిస్తోంది. పాఠశాల ఆవరణకు 50 మీటర్ల దూరం వరకు ఈ పదార్థాల విక్రయాలనూ నిషేధించాలి పేర్కొంది. పిల్లలకు ఏ ఆహారం మంచిది? ఏది కాదు? ఏది అమ్మాలి? ఏది అమ్మకూడదనేది స్పష్టంగా నిర్వచిస్తూ కొత్త ప్రమాణాలను రూపొందిస్తున్నట్లు మండలి స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. బడ్జెట్‌లో 66శాతం మౌలికానికే ఖర్చు చేశాం

బడ్జెట్‌లో 66శాతం నిధులను మౌలిక సదుపాయాల నిర్మాణానికే ఖర్చు చేసినట్లు కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారుడు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడారు. జీఎస్టీ రిఫండ్‌ల ప్రక్రియను మరింత సరళతరం చేశామని ఆమె తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ట్రంప్‌ అభిశంసనపై వచ్చే వారమే ఓటింగ్‌!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో ఓటింగ్‌కు రంగం సిద్ధమైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవేనని ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని 23-17 ఓట్ల తేడాతో ఆమోదించింది. వచ్చేవారమే అభిశంసనపై పూర్తిస్థాయి సభలో ఓటింగ్‌ జరిగే అవకాశాలున్నాయి.

10. సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహ విందు వేడుక


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.