పుంగనూరులో ముందుకురాని తెదేపా నేతలు
close

తాజా వార్తలు

Updated : 02/03/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుంగనూరులో ముందుకురాని తెదేపా నేతలు

పుంగనూరు: గత ఏడాది మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకున్న సంఘటనల దృష్ట్యా తిరిగి నామినేషన్ల దాఖలుకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించినా తెదేపా నేతలు ముందుకు రాలేదు. పుంగనూరులోని 9, 14, 28 వార్డుల్లో కొత్తగా నామినేషన్లు వేసేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొత్తగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే గడువు ముగిసినా తెదేపా నేతలు ఒక్క నామినేషనూ దాఖలు చేయలేదు. 

తీవ్రంగా భయపెట్టారు: శ్రీనాథ్‌రెడ్డి

వైకాపా నేతల బెదిరింపులతో తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులను వైకాపా నేతలు తీవ్రంగా భయపెట్టారని.. మరో ఇద్దరు అభ్యర్థులు ఎక్కడున్నారో తెలియడం లేదని పుంగనూరు తెదేపా ఇన్‌ఛార్జ్‌ శ్రీనాథ్‌రెడ్డి ఆరోపించారు. వైకాపా దౌర్జన్యాలకు నిరసనగా అసలు నామినేషన్లే దాఖలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ తమను పోటీ చేయనిస్తారన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ శక్తినంతా 2024 ఎన్నికల్లో తెదేపా గెలుపు, చంద్రబాబును సీఎంగా చేయడం కోసమే ఉపయోగిస్తామన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని