కాణిపాకం వినాయకునికి భారీ విరాళం
close

తాజా వార్తలు

Updated : 27/02/2021 11:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాణిపాకం వినాయకునికి భారీ విరాళం

కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రవాస భారతీయడు రూ.7కోట్ల విరాళం ఇచ్చారు. శనివారం ఉదయం ఆలయ ఈవో ఎ.వెంకటేశ్‌కు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి రూ.8.75కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నిర్మాణ వ్యయం మొత్తాన్ని తానే ఇస్తానని ప్రవాసభారతీయుడు చెప్పారని, ఇందులో భాగంగా మొదటి విడతగా ఇవాళ రూ.7కోట్లు ఇచ్చారని ఈవో వెల్లడించారు. దాత, కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో  అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. విరాళం అందజేసిన ప్రవాస భారతీయుడు(ఎన్‌ఆర్‌ఐ) తన పేరు వెల్లడించేందుకు నిరాకరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని