‘స్క్విడ్‌ గేమ్‌’పై పాకిస్థానీల  అక్కసు! ఎందుకంటే..

తాజా వార్తలు

Published : 20/10/2021 01:09 IST

‘స్క్విడ్‌ గేమ్‌’పై పాకిస్థానీల  అక్కసు! ఎందుకంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్క్విడ్‌ గేమ్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్‌ వాచ్‌డ్‌ వెబ్‌సిరీస్‌గా దూసుకుపోతుంది. ఓటీటీల్లో అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇదో మంచి థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ అని ప్రశంసిస్తుంటే.. పాకిస్థాన్‌ ప్రజలు మాత్రం ఈ వెబ్‌సిరీస్‌పై అసంతృప్తిగా ఉండటంతోపాటు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ కొరియాలో తెరకెక్కిన ‘స్క్విడ్‌ గేమ్‌’ వెబ్‌సిరీస్‌ సెప్టెంబర్‌ 17న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది చూసిన సిరీస్‌గా రికార్ఢు సృష్టించింది. అప్పుల్లో కూరుకుపోయిన కొందరిని స్క్విడ్‌ గేమ్‌ ఆడేందుకు ఆహ్వానిస్తారు. ఈ ఆటలో గెలిచిన విజేతకు భారీ మొత్తంలో నగదు బహుమతి ఉంటుంది. మరి ఆ ఆటలేంటి? పోటీదారులు ఎలా ఆడారు? అన్నది వెబ్‌సిరీస్‌లో ఆసక్తికరంగా మలిచారు. అయితే, ఇందులో 199 నంబర్‌ ఆటగాడు.. అలీ అబ్దుల్‌ పాత్రలో భారతీయుడు, దిల్లీకి చెందిన అనుపమ్‌ త్రిపాఠి నటించాడు. అతడి నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక్కడే పాకిస్థానీలు అసంతృప్తికి గురయ్యారు. ఎందుకంటే అనుపమ్‌ పోషించింది.. కొరియాకు వలస వెళ్లిన పాకిస్థాన్‌ దేశస్థుడి పాత్ర. దీంతో ‘స్క్విడ్‌ గేమ్‌’ రూపొందించిన దర్శకనిర్మాతలపై పాకిస్థానీ నెటిజన్లు అక్కసు వ్యక్తంచేస్తున్నారు. ఆ పాత్రకు నిజమైన పాకిస్థాన్‌ నటుడిని ఎందుకు ఎంచుకోలేదని సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

అయితే, అలీ పాత్రను పోషించిన అనుపమ్‌ త్రిపాఠికి పలువురు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. అనుపమ్‌ కొరియాలో నివసిస్తున్నాడు. అక్కడే చదువుకున్నాడు.. అక్కడే కె-డ్రామా, సినిమాల్లో అనేక పాత్రలు పోషిస్తున్నాడు. వాటిలో స్క్విడ్‌ గేమ్‌లోని అలీ పాత్ర ఒకటి. దానికి ఇంత అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏముంది’అని అంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని