పీఏల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు
close

తాజా వార్తలు

Published : 30/03/2021 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీఏల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు

హైదరాబాద్‌: రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పీఏల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ప్రభుత్వ స్థలాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల నుంచి డబ్బుల వసూలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ప్రధాన నిందితుడైన సుధాకర్‌తో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని