Allu Arjun: నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్‌ పోస్ట్‌

‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్‌ పెట్టారు.

Published : 07 May 2024 11:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ (Allua Arjun) కెరీర్‌ను మలుపు తిప్పి ఎందరికో లైఫ్ ఇచ్చిన సినిమా ‘ఆర్య’(Arya). సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్‌ స్టోరీకి యూత్‌ అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తవ్వడంతో సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు,  విశేషాలు సందడి చేస్తున్నాయి. ‘ఆర్య’ రోజులను గుర్తుచేసుకుంటూ బన్నీ కూడా పోస్ట్‌ పెట్టారు. ‘‘ఆర్య’కు 20 ఏళ్లు. ఇది సినిమా రిలీజ్ డేట్‌ మాత్రమే కాదు. నా జీవితాన్ని మార్చిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని రాసుకొచ్చారు. స్వీట్‌ మెమొరీస్‌ అంటూ ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. గతంలో ఓ సందర్భంలో సుకుమార్‌ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్‌ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది. ఆ ఒక్క సినిమా నా జీవితాన్ని, తన కెరీర్‌ను మార్చేసింది’ అని చెప్పారు.

ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్‌ను ఫైనల్‌ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..

ఇక ఈరోజు సాయంత్రం మూవీ యూనిట్‌ రీ యూనియన్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. 20 ఏళ్ల సెలబ్రేషన్స్‌ చేసుకోనున్నారట. ఆ పార్టీకి అల్లు అర్జున్‌తో పాటు సుకుమార్‌, దిల్‌రాజు కూడా పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘పుష్ప2’ (Pushpa2) తెరకెక్కుతోంది. వీళ్ల హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప ది రైజ్‌’ తెరకెక్కి భారీ విజయాన్ని అందుకోవడంతో దాని సీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది.  రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజ్‌ కానుంది. ఇప్పటికే రిలీజైన తొలిపాట రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని