మద్దతుధరపై తప్పుడు వాగ్దానాలు: ప్రియాంక
close

తాజా వార్తలు

Published : 22/11/2020 22:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మద్దతుధరపై తప్పుడు వాగ్దానాలు: ప్రియాంక

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం పంటల ‘కనీస మద్దతు ధర’ విషయంలో తప్పుడు వాగ్దానాలు చేస్తోందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ ఆరోపించారు. కొన్ని భాజపా పాలిత రాష్ట్రాల్లో మద్దతు ధరను పంట పెట్టుబడి ఖర్చు కన్నా తక్కువగా నిర్ణయించినట్లు నివేదికలు వచ్చినట్లు ఆమె ఆరోపించారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ ట్విటర్‌ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు. ‘కొన్ని భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతులు పంట ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కన్నా తక్కువగా మద్దతు ధర నిర్ణయించినట్లు నివేదికలు వచ్చాయి. కనీస మద్దతు ధర పెంచుతామని వాగ్దానాలు ఇస్తూనే భాజపా రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తోంది. ఒకసారి ఉత్తరప్రదేశ్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే పరిస్థితి అర్థం అవుతుంది’ అని ప్రియాంక ట్వీట్‌లో వెల్లడించారు. అంతేకాకుండా నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ నూతన వ్యవసాయ చట్టాల ద్వారా పారిశ్రామికవేత్తలకు సాయం చేస్తోందని ఆరోపించారు. కాగా కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 26న దేశరాజధానికి వెళ్లే ఐదు జాతీయ రహదారుల నుంచి దిల్లీ ఛలో ర్యాలీ కార్యక్రమానికి రైతుల సంఘాలు పిలుపునిచ్చాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని