close

తాజా వార్తలు

Updated : 10/04/2021 20:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాకు కేంద్ర విధానాలే కారణం: రాహుల్ గాంధీ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మదమెక్కిన ఈ ప్రభుత్వానికి మంచి మాటలు గిట్టవని మండిపడ్డారు. 

శనివారం రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ..‘కేంద్ర ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాలతోనే దేశంలో కరోనా రెండో దశ ఏర్పడింది. వలస కార్మికులు మరోసారి పొట్ట చేత పట్టుకుని నగరాలను వీడాల్సిన పరిస్థితి తలెత్తింది. టీకా కార్యక్రమాన్ని విస్తృతం చేయడంతో పాటు ప్రభుత్వం వారికి డబ్బు అందించాలి. ఆర్థిక వ్యవస్థకు, సామాన్య పౌరుడికి ఇది చాలా అవసరం. కానీ అహంకారపూరితమైన ప్రభుత్వానికి మంచి మాటలంటే అలర్జీ’ అంటూ కేంద్రంపై మండిపడ్డారు. ‘భారత ప్రజలకు కావాల్సింది ఉద్యోగాలు, టీకాలు. కానీ ప్రభుత్వం వాటికి బదులుగా అబద్ధాలు, అవమానాలనే అందిస్తోంది’ అని మరో ట్వీట్‌లో విమర్శలు చేశారు. 

రెండోదశలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని, ఈ సమయంలో టీకా ఎగుమతి సరికాదంటూ నిన్న రాహుల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. టీకా ఎగుమతిని తక్షణమే నిలిపివేసి, దేశంలో అవసరమైన వారందరికీ టీకాలు వేయాలని ఆయన ప్రధానిని కోరిన సంగతి తెలిసిందే.    

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని